లేఖనాలను అన్వేషించండి

యోబు 17: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 32:21

మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్షపాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను

యోబు 32:22

ముఖస్తుతి చేయుట నాచేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.

కీర్తనలు 12:2

అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

కీర్తనలు 12:3

యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.

సామెతలు 20:19

కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

సామెతలు 29:5

తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.

1దెస్సలోనీకయులకు 2:5

మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

నిర్గమకాండము 20:5

ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు

ద్వితియోపదేశాకాండము 28:65

ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

1రాజులు 11:12

అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారునిచేతిలోనుండి దాని తీసివేసెదను.

విలాపవాక్యములు 4:17

వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురుచూచుచుంటిమి.

ద్వితియోపదేశాకాండము 28:32

నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

యోబు 13:7

దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

సామెతలు 19:22

కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.