యోబు 33: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు? "
సంబంధిత రిఫరెన్స్‌లు
కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.
మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.
మంటికుండ పెంకులలో ఒక పెంకైయుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.
నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై
దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.
అప్పుడతడు నేలమీద పడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును;
ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?
ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.
రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారివియు నగునని చెప్పుదురు.
బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు.
నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు.
ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?
దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?
ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను; ఆ యా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను; తమకంటె బలవంతుడైన వానితో వారు వ్యాజ్యెమాడజాలరు.
రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు?
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించియుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.