లేఖనాలను అన్వేషించండి

యోబు 7: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 7:13

నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా

యోబు 7:14

నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

యోబు 17:12

రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.

యోబు 30:17

రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.

ద్వితియోపదేశాకాండము 28:67

నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.

కీర్తనలు 6:6

నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొనిపోవుచున్నది.

కీర్తనలు 77:4

నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను.

కీర్తనలు 130:6

కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.

కీర్తనలు 109:23

సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు

యెషయా 54:11

ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

యోబు 33:19

వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుటవలనను వాడు శిక్షణము నొందును

కీర్తనలు 73:14

దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.