లేఖనాలను అన్వేషించండి

యోహాను 18: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 11:53

ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

లూకా 11:54

వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

లూకా 20:20

వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగులవారిని ఆయన యొద్దకు పంపిరి.

మత్తయి 26:62

ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.

మార్కు 4:2

ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను

అపోస్తలులకార్యములు 1:1

ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన

అపోస్తలులకార్యములు 4:27

ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

అపోస్తలులకార్యములు 7:1

ప్రధానయాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను.