యోహాను 18: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.
నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
అతడు మరల నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.
అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుబెట్టుకొనుటకును మొదలుపెట్టెను.
మరికొంతసేపటికి మరియొకడు అతని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.