యోహాను 4: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా
నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టుక్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.
నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.
ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.
అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;
కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమనుకొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.
అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.
దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.