యోహాను 4: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.
మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.
మీ ద్రాక్షపండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురిపించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒకచోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.
రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.
వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
పంపినప్పుడాయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పునడిగెను గాని
అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.
మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.
పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు.