లేఖనాలను
అన్వేషించండి
యోహాను 7: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;"
సంబంధిత రిఫరెన్స్‌లు
యోహాను 11:56
వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
యోహాను 6:24
కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.
యోహాను 7:25
యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకువాడు ఈయనే కాడా?
యోహాను 9:12
వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.