యోహాను 7: 45
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుకపెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీదపడిరి.
నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా
ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొనిరి.
నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;
నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమైపోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.
కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.
తమ్మునుగూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.
ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారిచేతినుండి తప్పించుకొనిపోయెను.