లేఖనాలను అన్వేషించండి

యోహాను 9: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 5:44

అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;

యోహాను 12:37

యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.

యోహాను 12:38

ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.

యోహాను 12:39

ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా

యోహాను 12:40

వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

ఆదికాండము 19:14

లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.

యెషయా 26:11

యెహోవా, నీ హస్తమెత్తబడియున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.

యెషయా 53:1

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

లూకా 16:31

అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.

హెబ్రీయులకు 3:15

ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢవిశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.

హెబ్రీయులకు 3:16

విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవారందరే గదా

హెబ్రీయులకు 3:17

ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలిపోయెను.

హెబ్రీయులకు 3:18

తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరినిగూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా

హెబ్రీయులకు 3:19

కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము.

హెబ్రీయులకు 4:11

కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదము.

అపోస్తలులకార్యములు 3:10

శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.