యోహాను 9: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు వాని తలిదండ్రులువీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి.
వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే నేనే యనెను.
శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంతమాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.