యెహోషువ 13: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీ యుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని"
సంబంధిత రిఫరెన్స్‌లు
దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను.
నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను.
మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీచేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.
అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధము లన్నిటిని చూడనివారందరిని శోధించి
పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు.
అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.
తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నాకేమైన చేయుదురా?
గిలాదును, గెషూరీ యులయొక్కయు మాయకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు
అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయకా తీయులును నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించు చున్నారు.
హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు.
అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా
కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగయీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.
అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.
అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత
నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా
చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.
యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకును ఉండు రాజులందరి పైని అతడు ఏలుబడి చేసెను.
దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు.