యెహోషువ 13: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.
మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను
ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని.
కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.
మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను
మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోనువరకును శెనీరువరకును హెర్మోను పర్వతమువరకును వ్యాపించిరి.
నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒకభాగము.