యెహోషువ 18: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించినయెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆ యా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నాయొద్దకు తీసికొనివచ్చెదరు."
సంబంధిత రిఫరెన్స్‌లు
కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీన పరచుకొన వెళ్లకుండ మీరెన్నాళ్లు తడవుచేసెదరు?
కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.
ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి
మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నాయొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.
ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా, గ్రామములచొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువయొద్దకు వచ్చిరి.
ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువాడొకడును ఉండడు.