యెహోషువ 18: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు లేచి యీ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.
మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నాయొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.
వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.
కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.
యూదా వంశ మును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టు బడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.
అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.
తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు
ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.
మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించి నట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.
యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.
అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి.
ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.
అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయువాటినే ఆసక్తితో అనుసరింతము.
అవి రావలెనని ఆయన చీట్లువేసెను ఆయన కొలనూలు చేతపట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును యుగయుగములు దానిలో నివసించును.