లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 18: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 12:6

అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.

ఆదికాండము 27:22

యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి స్వరము యాకోబు స్వరము గానిచేతులు ఏశావుచేతులే అనెను.

మత్తయి 26:73

కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

యెషయా 22:16

ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు

న్యాయాధిపతులు 18:13

అక్కడనుండి వారు ఎఫ్రాయిమీ యుల మన్యప్రదేశమునకు పోయి మీకా యింటికి వచ్చిరి.

న్యాయాధిపతులు 18:14

కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మను ష్యులు తమ సహోదరులను చూచిఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా

యెషయా 52:5

నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది