న్యాయాధిపతులు 7: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు.
వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.
ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును.
గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.