లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 25: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 2:3

కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

నిర్గమకాండము 23:10

ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను.

లేవీయకాండము 23:14

మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.