లేవీయకాండము 25: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగిపోవును."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను.
ఆ పొలము సునాద సంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.
వారు బ్రదికియున్నను అమ్మువాడు అమ్మినదానికి తిరిగిరాడు, ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరుగును, వారందరు దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరును ధైర్యము చేయరు.