లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 25: 45

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టినవారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 56:3

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

యెషయా 56:4

నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యెషయా 56:5

నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

యెషయా 56:6

విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

నిర్గమకాండము 21:2

నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడైయుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.

నిర్గమకాండము 21:21

అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.