లేఖనాలను అన్వేషించండి

లూకా 1: 39

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి"

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 7:25

దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచునట్లు దృఢపరచి

2సమూయేలు 7:26

సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము.

2సమూయేలు 7:27

ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను.

2సమూయేలు 7:28

యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము.

2సమూయేలు 7:29

దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.

కీర్తనలు 116:16

యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.

రోమీయులకు 4:20

అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

రోమీయులకు 4:21

దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

కీర్తనలు 119:38

నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.

ఆదికాండము 24:58

రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.

1దినవృత్తాంతములు 17:23

యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.

కీర్తనలు 86:16

నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.

సామెతలు 31:26

జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.