లూకా 11: 48
క్రాస్-రిఫరెన్స్‌లు
" కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు
మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణవిషయములో వారితో పాలివారమై యుండకపోదుమని చెప్పుకొందురు.
అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.
సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు?
ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,
తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.
స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలెననియు
నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు
వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము.
వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.
ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టు నున్న సకల ప్రజల యెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.
పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.
మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.