లేఖనాలను అన్వేషించండి

లూకా 12: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 19:17

ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా

యోబు 1:12

యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలువెళ్లెను.

యోబు 2:4

అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

యోబు 2:6

అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

సామెతలు 13:8

ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.

అపోస్తలులకార్యములు 27:18

మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయసాగిరి.

అపోస్తలులకార్యములు 27:19

మూడవ దినమందు తమచేతులార ఓడసామగ్రి పారవేసిరి.

అపోస్తలులకార్యములు 27:38

వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.

మత్తయి 6:25

అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి;