లేఖనాలను అన్వేషించండి

లూకా 20: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 2:10

ఆ తరమువారందరు తమ పితరులయొద్దకు చేర్బబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా

ప్రసంగి 1:4

తరము వెంబడి తరము గతించిపోవుచున్నది; భూమి యొకటే యెల్లప్పుడును నిలుచునది.

ప్రసంగి 9:5

బ్రదికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.

హెబ్రీయులకు 9:27

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.