లూకా 24: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే పేతురు లేచి, సమాధియొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానినిగూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,
లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
అందుకు ఎవరి చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.
నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
సీయోనుకు తిరిగివచ్చినవారిని యెహోవా చెరలోనుండి రప్పించినప్పుడు
అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.
యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.
ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి.
అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.