లేఖనాలను అన్వేషించండి

లూకా 8: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 11:33

ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును.

మత్తయి 5:15

మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు.

మత్తయి 5:16

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.

మార్కు 4:21

మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా

మార్కు 4:22

రహస్యమేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగు చేయబడలేదు

అపోస్తలులకార్యములు 26:18

వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

ఫిలిప్పీయులకు 2:15

సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

ఫిలిప్పీయులకు 2:16

అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమునుచేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయ కారణము కలదు

ప్రకటన 1:20

అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు

ప్రకటన 2:1

ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా

ప్రకటన 11:4

వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.