మార్కు 10: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము."
సంబంధిత రిఫరెన్స్‌లు
శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా
ఇది వినినవారు ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా
ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.
యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,
నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికిపోకుండ జాగ్రత్తగా ఉండుడి.
సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
నా ఆస్తి గొప్పదని గాని నాచేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించినయెడలను
లోకుల చేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనవిస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మికయుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు.
బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి.
నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకముచేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.
తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును;
నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని
నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను.
అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా
ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.
మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.
మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.
నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానినిగూర్చియు వారితో మాటలాడెను.
ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.
శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
కొన్ని క్రొత్తసంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొనగోరుచున్నామని చెప్పిరి.