లేఖనాలను అన్వేషించండి

మార్కు 10: 45

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 12:7

వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.

మత్తయి 23:11

మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.

ఫిలిప్పీయులకు 2:7

మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.