మార్కు 4: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" త్రోవప్రక్కనుండు వారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తికొనిపోవును."
సంబంధిత రిఫరెన్స్‌లు
వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;
ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.
ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిననాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.
ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
విత్తువాని గూర్చిన ఉపమానభావము వినుడి.
మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి,