మార్కు 4: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును."
సంబంధిత రిఫరెన్స్‌లు
వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
వినుటకు చెవులుగలవాడు వినుగాక.
చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియు చెందడు.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును; పొందినవానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.
కలిగినవానికి ఇయ్యబడును, లేనివాని యొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.