లేఖనాలను అన్వేషించండి

మార్కు 6: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎఫెసీయులకు 6:15

పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి.

అపోస్తలులకార్యములు 12:8

అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైనవేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

లూకా 9:3

మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు.

లూకా 10:4

మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;

లూకా 22:35

మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు ఏమియు తక్కువ కాలేదనిరి.