లేఖనాలను అన్వేషించండి

మార్కు 6: 55

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 9:10

యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

ఫిలిప్పీయులకు 3:10

ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును,

మత్తయి 15:30

బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.

మార్కు 6:33

వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణములనుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి.

అపోస్తలులకార్యములు 5:16

మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

అపోస్తలులకార్యములు 10:38

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను

అపోస్తలులకార్యములు 28:9

ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులుకూడ వచ్చి స్వస్థత పొందిరి.