లేఖనాలను అన్వేషించండి

మార్కు 7: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక"

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 15:5

మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు.

మత్తయి 23:18

మరియు బలిపీఠము తోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణము తోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

1తిమోతి 5:4

అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.

1తిమోతి 5:5

అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలుకడగా ఉండును.

1తిమోతి 5:6

సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకుచుండియు చచ్చినదై యుండును.

1తిమోతి 5:7

వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము.

1తిమోతి 5:8

ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.

నిర్గమకాండము 21:17

తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

లూకా 21:1

కానుకపెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.

2తిమోతి 3:2

ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు