సంఖ్యాకాండము 15: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.
సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను, గొఱ్ఱలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.
ఆమె భర్త వినినదినమందే వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువకపోవును; ఆమె భర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.
వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక
మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని