లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 19: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 14:54

ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు

లేవీయకాండము 15:32

స్రావము గలవాని గూర్చియు, వీర్యస్ఖలనమువలని అపవిత్రత గలవాని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.

లేవీయకాండము 21:1

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.

లేవీయకాండము 21:11

అతడు శవము దగ్గరకు పోరాదు; తన తండ్రి శవము వలననేగాని తన తల్లి శవము వలననేగాని తన్ను అపవిత్రపరచుకొనరాదు.

సంఖ్యాకాండము 6:9

ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను.

సంఖ్యాకాండము 31:20

మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.