సంఖ్యాకాండము 9: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడలన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొనిపోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు.
అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కా పండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
మొదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.