కీర్తనలు 78: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.
మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవుని మీద కూడను పలికిరి.
అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.
వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు?
ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు
ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా
ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.
అందుకు ఎవరి చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.
మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి.
అందుకాయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడనుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి.
ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.
ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.