కీర్తనలు 78: 65
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నా బలిపీఠము నొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.
నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును.ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.
మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.
అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను
రాజు దోయేగుతో నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడి ఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను.
మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.
ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను.
ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై
వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్టబడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
మీ శిరోభూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాదరక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించిపోవుదురు.
వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.
నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు.
దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను.
వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంటవలె పడి యుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.
నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించిచూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా?
వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు.
అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.