ప్రకటన 16: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;"
సంబంధిత రిఫరెన్స్‌లు
మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటిబుగ్గల మీదను పడెను.
ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదైపోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.
అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;
అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను
యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.
అతని పర్వతములను హతమైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.
నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని శత్రువు కొల్లపెట్టును.
అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.
వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దానియొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతినిగూర్చి సంతోషించును ఇదే యెహోవా వాక్కు