లేఖనాలను అన్వేషించండి

ప్రకటన 6: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను (లేక తెగులువలనను) భూమిలోనుండి క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

ప్రకటన 6:1

ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.

ప్రకటన 6:3

ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని

ప్రకటన 6:5

ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.

ప్రకటన 4:7

మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడ వంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖమువంటి ముఖము గలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది.

ప్రకటన 8:1

ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.