ప్రకటన 8: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడై యుండువాని కుడిచేత చూచితిని.
ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,
ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త
అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.
సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.
అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.