లేఖనాలను అన్వేషించండి

ప్రకటన 9: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ప్రకటన 9:10

తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.

యెషయా 9:15

పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

ఎఫెసీయులకు 4:14

అందువలన మనమికమీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక

యిర్మియా 8:17

నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.

ప్రకటన 12:4

దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.