లేఖనాలను
అన్వేషించండి
రూతు 3: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను నిన్ను విడిపింపగల వాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువుడొకడున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 7:12
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.
1దెస్సలోనీకయులకు 4:6
ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.
లేవీయకాండము 25:25
నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడిపించును.