లేఖనాలను అన్వేషించండి

రూతు 3: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ప్రసంగి 7:1

సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మదినముకంటె మరణదినమే మేలు.

రోమీయులకు 12:17

కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి.

రోమీయులకు 14:16

మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.

1కొరిందీయులకు 10:32

యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.

2కొరిందీయులకు 8:21

ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటినిగూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.

1దెస్సలోనీకయులకు 5:22

ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.

1పేతురు 2:12

అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను