Logo

2సమూయేలు అధ్యాయము 5 వచనము 4

లూకా 3:23 యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడు గలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,

1దినవృత్తాంతములు 26:31 హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటిపెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి.

1దినవృత్తాంతములు 29:27 అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.

ఆదికాండము 41:46 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.

2సమూయేలు 2:11 దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.

1రాజులు 1:1 రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను.

1రాజులు 2:11 దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.

1దినవృత్తాంతములు 3:4 ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,

హెబ్రీయులకు 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;