Logo

2సమూయేలు అధ్యాయము 5 వచనము 8

యెహోషువ 15:16 కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా

యెహోషువ 15:17 కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.

1సమూయేలు 17:25 ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటివారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా

1దినవృత్తాంతములు 11:6 ఎవడు మొదట యెబూసీయులను హతముచేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.

1దినవృత్తాంతములు 11:7 తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.

1దినవృత్తాంతములు 11:8 దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.

1దినవృత్తాంతములు 11:9 సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.

యెహోషువ 18:28 వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.

2సమూయేలు 5:6 యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి.

2సమూయేలు 24:16 అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా

యోవేలు 2:7 బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి