Logo

1రాజులు అధ్యాయము 4 వచనము 12

యెహోషువ 17:11 ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగియున్నది.

న్యాయాధిపతులు 5:19 రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి.

2రాజులు 23:29 అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.

2రాజులు 23:30 అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

1సమూయేలు 31:10 మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.

1సమూయేలు 31:12 బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

1రాజులు 7:46 యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.

యెహోషువ 3:16 పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

1రాజులు 18:46 యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను.

1రాజులు 19:16 ఇశ్రాయేలు వారిమీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయై యుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.

యెహోషువ 12:21 మెగిద్దో రాజు, కెదెషు రాజు.

యెహోషువ 17:16 అందుకు యోసేపు పుత్రులుఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయుల కందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురముల లోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి.

యెహోషువ 19:11 వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి

న్యాయాధిపతులు 7:22 ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్ద నున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా

1రాజులు 9:15 యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను.

2రాజులు 9:27 యూదా రాజైన అహజ్యా జరిగినదాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.

1దినవృత్తాంతములు 6:68 యొక్మెయామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

1దినవృత్తాంతములు 7:29 మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతివారు కాపురముండిరి.