Logo

1రాజులు అధ్యాయము 18 వచనము 13

1రాజులు 18:4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.

ఆదికాండము 20:4 అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?

ఆదికాండము 20:5 ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేనుచేతులతో ఏ దోషము చేయక యధార్థహృదయముతో ఈ పని చేసితిననెను.

కీర్తనలు 18:21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను

కీర్తనలు 18:22 ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను

కీర్తనలు 18:23 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.

కీర్తనలు 18:24 కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నాచేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

అపోస్తలులకార్యములు 20:34 నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నాచేతులు కష్టపడినవని మీకే తెలియును.

1దెస్సలోనీకయులకు 2:9 అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి

1దెస్సలోనీకయులకు 2:10 మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి

మత్తయి 10:41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.

మత్తయి 10:42 మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 25:35 నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

యెహోషువ 2:6 అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.

2రాజులు 2:7 ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దాను నదిదగ్గర నిలిచిరి.

2రాజులు 2:19 అంతట ఆ పట్టణపువారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమైయున్నదని ఎలీషాతో అనగా

2రాజులు 6:32 అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండియున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా

2రాజులు 8:12 హజాయేలు నా యేలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.

నెహెమ్యా 9:26 అయినను వారు అవిధేయులై నీమీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.

సామెతలు 28:12 నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు.

మత్తయి 5:12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

మత్తయి 14:8 అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నాకిప్పించుమని యడిగెను.

మత్తయి 21:35 ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరియొకనిమీద రాళ్లు రువ్విరి.

మార్కు 12:3 వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.

రోమీయులకు 11:3 ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.

హెబ్రీయులకు 11:37 రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,

హెబ్రీయులకు 11:38 అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.