Logo

1రాజులు అధ్యాయము 22 వచనము 5

సంఖ్యాకాండము 27:21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

యెహోషువ 9:14 ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా

న్యాయాధిపతులు 1:1 యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులుకనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా

న్యాయాధిపతులు 20:18 వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 20:23 మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 20:29 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.

1సమూయేలు 14:18 దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.

1సమూయేలు 23:2 అంతట దావీదు నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.

1సమూయేలు 23:4 దావీదు మరల యెహోవా యొద్ద విచారణ చేసెను నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీచేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా

1సమూయేలు 23:9 సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.

1సమూయేలు 23:10 అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడియున్నది.

1సమూయేలు 23:11 కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.

1సమూయేలు 23:12 కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను.

1సమూయేలు 30:8 నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

2రాజులు 1:3 యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవులేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?

2రాజులు 3:11 యెహోషాపాతు అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన1షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా

1దినవృత్తాంతములు 10:13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచములయొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను.

2దినవృత్తాంతములు 18:4 మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా

2దినవృత్తాంతములు 18:5 ఇశ్రాయేలురాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారినడిగెను. అందుకువారు పొమ్ము, దేవుడు రాజుచేతికి దానినప్పగించునని చెప్పిరి.

సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము

సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

యిర్మియా 21:2 బబులోను రాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధము చేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లిపోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయా యొద్దకు వారిని పంపగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

యిర్మియా 42:2 మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము.

యిర్మియా 42:3 మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.

యిర్మియా 42:4 కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును.

యిర్మియా 42:5 అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి నిన్ను మాయొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాట లేకుండ మేము జరిగించనియెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక.

యిర్మియా 42:6 మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము.

యెహెజ్కేలు 14:3 నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొనియున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?

యెహెజ్కేలు 20:1 ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవాయొద్ద విచారణ చేయుటకై నాయొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా

యెహెజ్కేలు 20:2 యెహోవా వాక్కు నాకు ప్రత్య క్షమై యీలాగు సెలవిచ్చెను

యెహెజ్కేలు 20:3 నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నాయొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

న్యాయాధిపతులు 18:5 అప్పుడు వారుమేము చేయ బోవుపని శుభమగునో కాదో మేము తెలిసికొనునట్లు దయ చేసి దేవునియొద్ద విచారించుమని అతనితో అనగా

1సమూయేలు 14:37 సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.

2దినవృత్తాంతములు 34:21 మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటల విషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించియున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.