Logo

ఎజ్రా అధ్యాయము 5 వచనము 2

ఎజ్రా 3:2 యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.

హగ్గయి 1:12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.

హగ్గయి 1:13 అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.

హగ్గయి 1:14 యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా

హగ్గయి 1:15 వారు కూడివచ్చి, రాజైన దర్యావేషు యొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.

జెకర్యా 6:11 వారినడిగి వెండి బంగారములను తీసికొని కిరీటము చేసి ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి

ఎజ్రా 6:14 యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపు రాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.

హగ్గయి 2:4 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

హగ్గయి 2:5 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీమధ్యన ఉన్నది గనుక భయపడకుడి.

హగ్గయి 2:6 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.

హగ్గయి 2:7 నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

హగ్గయి 2:8 వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

హగ్గయి 2:9 ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

హగ్గయి 2:20 మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

హగ్గయి 2:21 యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.

హగ్గయి 2:22 రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనముచేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.

హగ్గయి 2:23 నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగాచేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

జెకర్యా 3:1 మరియు యెహోవా దూత యెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.

జెకర్యా 4:14 అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.

2కొరిందీయులకు 1:24 మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమైయున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.

నిర్గమకాండము 31:6 మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.

1దినవృత్తాంతములు 3:17 యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు

1దినవృత్తాంతములు 6:15 యెహోవా నెబుకద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికిపోయెను.

ఎజ్రా 2:2 యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితో కూడ వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్కయిది.

ఎజ్రా 5:16 కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.

ఎజ్రా 10:18 యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.

నెహెమ్యా 2:17 అయితే వారితో నేనిట్లంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.

నెహెమ్యా 7:7 తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య యిదే.

నెహెమ్యా 12:1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా

హగ్గయి 1:2 సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.

హగ్గయి 1:14 యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా

హగ్గయి 2:18 మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.

హగ్గయి 2:21 యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.

జెకర్యా 8:9 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తలనోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.

మత్తయి 1:12 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;